ఉచిత వృత్తి శిక్షణ తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం: జి. ఎం వెంకటరమణ
శిక్షణ ఇచ్చుటకు ఆసక్తి గల(ఫ్యాకల్టీ) మహిళా అభ్యర్థులు కావలెను
కొత్తగూడెం సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి సేవా సమితి(Singareni Seva Samithi) ఆధ్వర్యంలో, ఉచిత వృత్తి శిక్షణ తరగతులు అనగా మగ్గం వర్క్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్ వర్క్ మరియు జ్యూట్ తయారీ శిక్షణ ఇచ్చుటకు ఆసక్తిగల ఫ్యాకల్టీ మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వీరికి కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండవలెను, అలాగే మగ్గం వర్క్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్ వర్క్, జ్యూట్ బ్యాగ్ తయారీలో శిక్షణ తీసుకున్న సర్టిఫికెట్లు, ఒక సంవత్సరం కాలం ఫ్యాకల్టీగా అనుభవం కలిగి ఉన్న మహిళలు ఫ్యాకల్టీగా శిక్షణ ఇవ్వడానికి అర్హులు అని, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు.
ఆసక్తి కలిగిన సింగరేణి ఉద్యోగుల గృహిణిలు, నిరుద్యోగ యువతులు, పరిసర ప్రాంత మహిళలు తేదీ. 01.10.2026 లోగా పర్సనల్ డిపార్ట్మెంటు నందు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. దరఖాస్తులను కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ నందు తేదీ. 01.10.2026, సాయంత్రం 4:00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు.