ఇల్లెందు నియోజకవర్గానికి 3,971 కొత్త పెన్షన్లు
అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం
ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు, (విజయక్రాంతి): అర్హులైన పేదలకు సామాజిక భద్రత(Social Security) కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు(Government sanctions new pensions) చేసిందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(Illandu MLA Koram Kanakaiah) తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,971 నూతన చేయూత పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. శుక్రవారం ఇల్లందు ఎంపీడీవో కార్యాలయంలో(Illandu MPDO Office) నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు(Beneficiaries) మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లందు మండలానికి 846, ఇల్లందు పట్టణానికి 349 పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన మండలాల్లోనూ విడతల వారీగా పంపిణీ చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ, చేనేత కార్మికులకు పెన్షన్లు ఆర్థికంగా అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. అర్హత ఉండి పెన్షన్ రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, మహాలక్ష్మి పథకాలతో పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, స్పెషల్ ఆఫీసర్ రవి, ఎంపీడీవో ధన్సింగ్, మున్సిపల్ కమిషనర్ ఎస్.సందీప్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.