బాలుర పాఠశాలలో స్వయంపరిపాలన దినోత్సవం

13-11-2026 | 04:58pm

మహదేవపూర్, నవంబర్ 13. (విజయక్రాంతి ) : బాలల దినోత్సవాన్ని(Childrens Day) పురస్కరించుకుని మహాదేవపూర్ మండల(Mahadevpur Mandal) కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో(Zilla Parishad Boys' High School) స్వయంపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా(Teachers) మారి వివిధ తరగతులకు పాఠాలు బోధించారు. నేటి ప్రధానోపాధ్యాయురాలిగా సల్పాల సంకీర్తన వ్యవహరించారు.

బోధన అనుకున్నంత సులభం కాదని, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని విద్యార్థులు అన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ తెలిపారు.ఉత్తమ బోధన చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు