వెల్దిలో ఘనంగా బాలల పండుగ వేడుకలు
జనగామ, నవంబర్ 13 (విజయక్రాంతి): వెల్ది ఆదర్శ పాఠశాల,ఇంటర్మీడియట్ కళాశాలలో బాలల దినోత్సవ వేడుకలు(Children's Day Celebrations) ఘనంగా జరిగాయి. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాలకుర్తి శ్రీధర్ మాట్లాడుతూ పిల్లలే దేశ భవిష్యత్తు అని, ప్రతి బాలబాలికలోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం ఉపాధ్యాయుల బాధ్యత అని పేర్కొన్నారు.
చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కందగట్ల గణేష్, జయశ్రీ, మల్లం శ్రీధర్, గాజర్ల రుద్రమదేవి, కట్ట రాజు, పోరిక పార్వతి, దారం శ్రీను, షహానా సుల్తానా, తుమ్మ రవి, శశికుమారి తదితరులు పాల్గొన్నారు.