ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

13-11-2026 | 04:58pm

మహబూబాబాద్: జిల్లాలో 25 ఏళ్ల సుష్మిత అనే యువతి మృతి(Woman Suicide) తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమ వ్యవహారంలో ఎదురైన సమస్యల నేపథ్యంలో ఆమె ఆత్మహత్య(Suicide) చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, బంధువులు మహబూబాబాద్(Mahabubabad) అండర్ బ్రిడ్జ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సుష్మిత రాసిన సూసైడ్ నోట్‌లో ఎనిమిది మంది పేర్లు ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆందోళనకారులు పేర్కొన్నారు.

ఘటనకు సంబంధించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు పరిశీలించి, అందులోని వ్యక్తుల పాత్రపై విచారణ చేపట్టారు. యువతి మృతికి దారితీసిన పరిస్థితులు, ఇతర కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు