ఎన్నికల ప్రాముఖ్యతపై వ్యాసరచన, క్విజ్ పోటీలు

13-11-2026 | 04:51pm

మహాదేవపూర్, నవంబర్ 13.(విజయక్రాంతి ) : మహదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College, Mahadevpur) ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా(Election Commission of India), జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు(Quiz competitions) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రూపులకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ నరసయ్యమాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు ప్రసాద్, గని, సమ్మయ్య, సదాశివ్, సదానందం, రమేష్, సంధ్య, సనత్, శ్రీనివాస్, మహేందర్, మహేష్, కరుణప్రకాష్, సునీల్, రమాదేవి, రాజయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు