చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన డిసిఓ రామ్మోహన్
నాగిరెడ్డిపేట్,నవంబర్ 13 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ(Tandur Primary Agricultural Cooperative Society) పరిధిలోని పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Paddy grain purchasing centers) డిసిఒ రామ్మోహన్ క్లస్టర్ ఇంచార్జ్ లక్ష్మణ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిఓ రామ్మోహన్ మాట్లాడుతూ... రైతులు(Farmers) వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్మడానికి సంసిద్ధంగా లేకపోవడంతో బయట ఎక్కువ రేటు వస్తుందని ధాన్యాన్ని అమ్మడం జరుగుతుంది.
బయట వారు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంట చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పూర్తి చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని ఎవరు అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర 2460 ఇవ్వడంతో పాటు 500 బోనస్ అందజేయడం జరుగుతుందన్నారు.
అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షాన నిరంతరం పోరాడుతూ పాటుపడతాడని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, డిసిఒ రామ్మోహన్,క్లస్టర్ ఇంచార్జ్ లక్ష్మణ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ గౌడ్,దివిటి కిష్టయ్య, సొసైటీ సిబ్బంది రాములు సాయిలు తదితరులు ఉన్నారు.