ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా

20-11-2026 | 09:22pm

ములకలపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Jeevitha Bima Scheme) కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)విద్యా చందన(Additional Collector Vidya Chandana) తెలిపారు. శుక్రవారం మండలంలోని సీతారాంపురం పంచాయతీ(Seetharampuram Panchayat) సుబ్బనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జీవిత బీమా నమోదు కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి అనూషతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా నమోదు ప్రక్రియ చేపట్టబడుతుందన్నారు. జీవిత బీమా నమోదుకు కావలసిన పత్రాలతో కేంద్రాన్ని సందర్శించి పేర్లను ఆన్లైన్ చేసుకోవాలని జిల్లాలోని  ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ,ఎంపీ ఓ రమేష్ కుమార్,సర్పంచి కుంజా రవి,పంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు