బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా వాకథాన్
హనుమకొండ,(విజయక్రాంతి): బాలల హక్కుల(Child Rights) వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమం(Walkathon program) పోలీస్ కమిషనరేట్ నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, డాన్ బాస్కో నవజీవన్, షేర్ స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిర్వహించగా జిల్లా సంక్షేమ అధికారి ఎం విశ్వజ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్, బాలల న్యాయ మండలి సభ్యురాలు డాక్టర్ గోపికా రాణి, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి జెండా ఊపి వాకథాన్ ప్రారంభించారు.
వాకథాన్ అనంతరం కళాజాత బృందం ఆధ్వర్యంలో బాలల హక్కులు, బాల్యవివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా నివారణ చర్యలుపై పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ బాలల హక్కుల ప్రాముఖ్యతపై వివరించారు. బాలల హక్కుల వొడంబడికలో హక్కులున్నాయని అందులో ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కులున్నాయి.
బాలల హక్కులకు భంగం కలుగకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అన్నారు. అనంతరం బెలూన్లను పిల్లలతో కలిసి ఎగురవేసి, సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి ఎం విశ్వజ, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సి హెచ్ అవంతి, సిస్టర్ సహాయ, ఫాదర్ కోషి , ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఇంచార్జి డిసిపిఓ ఎస్ ప్రవీణ్ కుమార్, జేజేబి మెంబర్ డాక్టర్ గోపికా రాణి, సిడిపివో లు, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.