జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు మాలోత్ నవీన్ కుమార్ ఎంపిక

20-11-2026 | 09:51pm

 రూ.4 వేల ఆర్థిక ప్రోత్సాహం...

 బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు కృష్ణారావు...

శివంపేట నవంబర్ 20( విజయక్రాంతి ) : క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు శివంపేట్ మండల(Shivampet Mandal) బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు(BRS senior leader Krishna Rao) ముందుకొచ్చారు. శివంపేట మండలం బీమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండాకు చెందిన మాలోత్ హనుమ(Maloth Hanuma) కుమారుడు నవీన్ కుమార్‌కు సాఫ్ట్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు రూ.4,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

నవీన్ కుమార్ ప్రస్తుతం నర్సాపూర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు.

ఈ నెల 24వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో నవీన్ కుమార్ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా కృష్ణారావు ఆర్థిక సహాయం అందించి విద్యార్థిని ప్రోత్సహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడం ఎంతో అవసరమని, నవీన్ జాతీయ స్థాయిలో రాణించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థికి ఆర్థిక చేయూత అందించిన కృష్ణారావును పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు