‘ఇందిరమ్మ జీవిత బీమా’ను ప్రారంభించిన డీసీ వాణిరెడ్డి

20-11-2026 | 09:48pm

ఘట్ కేసర్, నవంబర్ 20 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డి(Deputy Commissioner Vani Reddy) శుక్రవారం అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5లక్షలు  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గురువారం సిద్దిపేట్ లో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

11 మందికి భీమా పత్రాలను అందజేశారు. డిప్యూటీ కమిషనర్ వాణి మాట్లాడుతూ ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఘట్ కేసర్ సర్కిల్ లోని 4 డివిజన్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబాలకు ఈ భీమా పథకం వర్తిస్తుందన్నారు. రేపటి నుండి 12 సెంటర్స్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అని తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్, నాగారం డివిజన్ అధ్యక్షులు భూమయ్య యాదవ్, ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షులు సామల అమర్, ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు మీసాల సుధాకర్ రావు, బద్దం నరసింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు అనూజ నాయక్, మాజీ సర్పంచ్ లు చిన్న నరసింహ గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు