ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం వాల్ పోస్టర్ ఆవిష్కరణ
రాజాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం వాల్ పోస్టర్ ను శుక్రవారం తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పథకం ద్వారా కుటుంబానికి ప్రధాన జీవన ఆధారంగా ఉన్న సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా ఆర్థిక భరోసా కల్పించబడుతుందని తెలిపారు.
ఈ పథకానికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచందర్,పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, వార్డ్ సభ్యులు రహిమత్,వెంకటమ్మ, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్,యాదగిరి, నరేష్, కుమార్, కృష్ణ, చంద్రయ్య,చరణ్ తదితరులు పాల్గొన్నారు.