ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నాగిరెడ్డిపేట్, నవంబర్ 20 (విజయక్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామంలో(Venkampalli Village) ఐకెపి ఆధ్వర్యంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో(Paddy Procurement Centre) వరి ధాన్యం కొనుగోలును ప్రారంభించడం జరిగింది.శుభ్రపరిచిన వరి ధాన్యానికి ఎలాంటి తరుగు లేకుండా 40 కిలోల 700 గ్రాముల బరువుతో కాంటా వేయాలని సూచించడం జరిగింది. రైతులు(Farmers) పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని రైతులకు భరోసా కల్పించడం జరిగింది.
ప్రైవేటు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు అని రైతులకు తెల్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుకూరి జ్యోతిసురేందర్ రెడ్ఢి,ఉప సర్పంచ్ హన్మంత్ రెడ్డి,సీసీ నజీర్,జిపిఓ సిద్దిరాములు గ్రామ రైతులు పరిశోధన్ రెడ్డి,మాటూరి గోపాల్,సంగారెడ్డి,గ్రామ సంఘ మహిళలు తదితరులు పాల్గొన్నారు.