ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
రంగోలిలో మొదటి బహుమతి అందుకున్న రసజ్ఞ....
కొత్తగూడెం నవంబర్ 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కేంద్ర గ్రంథాలయంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు(National Library Week Celebrations) ముగింపు సందర్భంగా శుక్రవారం బహుమతుల ప్రదానోత్సవంతో ఘనంగా ముగిశాయి. 19వ తేదీన నిర్వహించిన రంగోలిలో కే. రసజ్ఞ అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి బహుమతిని కైవసం చేసుకుంది.
గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కార్యదర్శి కె. కరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ మూడ్ గణేష్, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) శంభు ప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు గ్రంథాలయాలు చక్కని వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. విద్యార్థులకు తమలోని ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
డీఈఓ శంభు ప్రసాద్ మాట్లాడుతూ ,విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలంటే ఇలాంటి సృజనాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందుతాయని అన్నారు.
అనంతరం నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం తదితర వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రంథాలయంలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కనకయ్య, నాగమణి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాఠశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కార్యదర్శి కె. కరుణకుమారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది గ్రేడ్-2 గ్రంథపాలకురాలు ఎస్. లలిత కుమారి జి మణి మృదుల గీత సిహెచ్ శ్రీనివాస్ ఆర్ నాగన్న కె రవిబాబు మధుబాబు వాణి వంశీ ఎస్ కే జానీ