నవోదయ విద్యార్థులకు జిల్లా స్థాయి గ్రాండ్ టెస్ట్

25-11-2026 | 10:13pm

సారపాక బ్రిలియంట్ హైస్కూల్‌లో రేపు మోడల్ పరీక్ష

బూర్గంపాడు, (విజయక్రాంతి): నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల ప్రతిభను అంచనా వేసేందుకు సారపాక బ్రిలియంట్ హైస్కూల్(Sarapaka Brilliant High School) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నవోదయ గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ నెల 26న గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాల ప్రాంగణంలో పరీక్ష జరగనుంది. ఈ విషయాన్ని నవోదయ కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్. వెల్లడించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ మోడల్ పరీక్షకు హాజరై తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చని తెలిపారు.

ప్రవేశ పరీక్ష ప్రశ్నల సరళి, పరీక్షా విధానం, సమయపాలనపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, అసలు పరీక్షను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ దోహదపడుతుందన్నారు. గత 15 ఏళ్లుగా నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేస్తూ, ఎంతోమందికి నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు సాధించడంలో తమ కోచింగ్ సెంటర్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9866283566 నంబరును సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు