ఇందిరమ్మ జీవిత బీమాకు దరఖాస్తుల స్వీకరణ
నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ సిహెచ్. నాగరాజు
నేరేడుచర్ల, నవంబర్ 18(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Family Life Insurance Scheme) కింద 18 నుంచి 59 ఏండ్ల వయస్సు గల వారికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్ననందున అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సిహెచ్. నాగరాజు పత్రిక ప్రకటనలో తెలిపారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని,.మొదటి దశలో నవంబర్ 19 నుంచి 28 వరకు మున్సిపల్ కార్యాలయంలో 2, 3, 9, 10, 11 వార్డుల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
రెండో దశలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు వెంకట్రామా సినిమా హాల్లో, 4, 12, 13 వార్డులు.. మార్కెట్ కార్యాలయంలో 5, 14, 15 వార్డుల వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటారని, మూడో దశలో డిసెంబర్ 9 నుంచి 18 వరకు మరియానంద పాఠశాలలో 1, 6, 7, 8 వార్డుల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన ప్రజలు తమ వార్డుకు కేటాయించిన కేంద్రంలో నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.