నూతన పెన్షన్లతో ఆర్థిక భరోసా

13-11-2026 | 07:40pm

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

దమ్మపేట, నవంబర్ 13(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఆర్ధిక భరోసా(Financial Security) కల్పించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నూతన పెన్షన్లు మంజూరు(Sanction of pensions) చేసింది. ఇందులో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గానికి 4,900 కొత్త పెన్షన్లు మంజూరు కాగా దమ్మపేట మండల పరిధిలో సుమారు 907 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా దమ్మపేట తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(Dammapeta Telangana Tribal Welfare Residential School) మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ నెల 19వ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ కానుందని తెలిపారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులతో పాటు అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారుల కుటుంబాలకు ప్రతినెలా అందే పెన్షన్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ, రూరల్ డెవలప్మెంట్ శాఖామంత్రి ధనసరి సీతక్క (అనసూయ)కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరాల రమేష్, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దిశెట్టి జ్యోతి, జిల్లా దిశాకమిటీ సభ్యురాలు సొంగా ఏసుమణి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, దమ్మపేట తహసీల్దార్, (డిప్యూటీ కలెక్టర్) మద్దినేని మురళి, సర్పంచుల సంఘం అధ్యక్షులు వంకా జానకిరామ్, ఇతర శాఖల అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు