పాఠశాలలో వినుత్నంగా విక్టరీ ల్యాప్
కొత్తపల్లి, నవంబరు 13 (విజయ క్రాంతి): కొత్తపల్లి లోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో(Alforce E-Techno School) విక్టరీ ల్యాప్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై కార్యక్రమాల ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల జీవితంలో క్రీడలు చాలా ప్రభావితం చేస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడలలో పాల్గొనటానికి ఆసక్తి ప్రదర్శించాలని అన్నారు.
వివిధ క్రీడల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, పాల్గొన్నారు.