మాక్ ఎన్నికలు.. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి
13-11-2026 | 08:08pm
బేల నవంబర్ 13 (విజయక్రాంతి): విద్యార్థుల్లో(students) నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేందుకు PM SHRI ZPHS బేల పాఠశాలలో(Bela School) మాక్ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఎన్నికల విధానం, నాయకుల ఎంపికపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎన్నికల్లో పోటీ చేసి తమ హామీలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.