జిల్లా టీఎన్జీవోల సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశం

13-11-2026 | 08:11pm

ముకరంపుర, నవంబర్ 13(విజయ క్రాంతి): కరీంనగర్ టీఎన్జీవోల సంఘ భవనంలో(TNGOs Association Building) జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి  అధ్యక్షతన జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం(Executive Meeting) శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దారం శ్రీనివాసరెడ్డి(Daram Srinivasa Reddy)  మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు, హక్కులు మరియు భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక అంశాలపై చర్చించారు.

ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న నిర్వహించనున్న భారీ ర్యాలీ కి టీఎన్జీవో కేంద్ర సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ర్యాలీ  పోస్టర్‌ను విడుదల చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా నెట్‌వర్క్ హాస్పిటల్ సర్వీసెస్ పరిధిలో ఉద్యోగులకు అందించే వైద్య సేవల విషయంలో ఏ ఉద్యోగి కూడా ఆసుపత్రుల్లో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆసుపత్రులు ఉద్యోగుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్థార్ హర్మీంధర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు