కార్తీక మాసం సందర్భంగా భక్తులకు విస్తృత ఏర్పాట్లు

13-11-2026 | 08:06pm

యాదగిరిగుట్ట, నవంబర్ 13 (విజయక్రాంతి) : కార్తీక మాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు(devotees) రానున్న సందర్భంగా  దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరము కూడా కార్తీక మాసంలో భక్తుల(devotees) రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కొండ కింద వ్రత మండపం వద్ద భక్తులు(devotees) వేచి ఉండేందుకు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా రెండు హాళ్ల ముందు పెద్ద పరిమాణంలో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తుల(devotees) రద్దీకి అనుగుణంగా అదనపు ప్రసాద విక్రయ కౌంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఎండ తీవ్రత వల్ల భక్తులకు(devotees) ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు  ఏర్పాటు చేయడం జరుగుతున్నదని దేవస్థానం అధికారులు తెలిపారు.

ప్రస్తుతం రోజు 300 పైచిలుకు  సత్యనారాయణ స్వామి  వ్రతాలు జరుగుతున్నాయని  కార్తీక పౌర్ణమి రోజు అత్యధికంగా వ్రతాలు జరుగుతాయని దానికోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతిరోజూ భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, ప్రసాద విక్రయాలు తదితర అన్ని సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అదనపు ఏర్పాట్లు చేపట్టేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలకు విచ్చేసే ప్రతి భక్తునికి సౌకర్యవంతమైన, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని విజ్ఞప్తి చేస్తుంది

మరిన్ని వార్తలు