రౌట సంకెపల్లిలో ఆధార్ కేంద్రం నిర్వహణ

13-11-2026 | 08:02pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జన జాతీయ గౌరవ దివస్‌లో(Tribal Pride Day) భాగంగా ఆసిఫాబాద్ మండలం రౌట సంకెపల్లి గ్రామంలో శుక్రవారం ఆధార్ కేంద్రాన్ని(Aadhaar center) నిర్వహించి ఆదివాసీలకు ఆధార్ సేవలు అందించారు. గ్రామంలోనే సేవలు అందుబాటులోకి రావడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో కొట్నాక్ శకుంతల, ఎస్‌సీఆర్‌పీ రాథోడ్ రవీందర్, సర్పంచ్ ఆత్రం కొండూ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు