కంచర్లలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

13-11-2026 | 07:54pm

గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

భిక్కనూర్, నవంబర్ 13 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం(Bikkanur Mandal) కంచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల కార్యకర్తలు(Congress and BJP party workers) మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Gampa Goverdhan) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో(BRS Party) చేరారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్, బీజేపీ విధానాలు నచ్చక, రైతులు, కూలీలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్‌లో చేరినట్లు వారు తెలిపారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పార్టీలో  20 మంది కార్యకర్తలు చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఇంచార్జి అధ్యక్షుడు అత్తేల్లి శ్రీనివాస్, అందె మహేందర్, బోండ్ల రామచంద్రం తో పాటు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు