విస్తరణ బాటలో కరూర్ వైశ్యా బ్యాంక్

03-11-2026 | 05:57pm

హైదరాబాద్: కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank), భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి. నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా దేశవ్యాప్తంగా తన శాఖల నెట్‌వర్క్‌ను 929కి విస్తరించింది. కీలక మార్కెట్లలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, మెట్రో నగరాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలన్న బ్యాంక్ నిబద్ధతను ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది.

బ్యాంక్ ప్రారంభించిన ఎనిమిది కొత్త శాఖల్లో మూడు తమిళనాడులో, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రెండేసి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి ఉన్నాయి. తమిళనాడులోని శాఖలు చెన్నైలోని చూలై, తిరుకళుకుండ్రం, తిరుచిరాపల్లిలోని వైయంపట్టిలలో ఉన్నాయి. కర్ణాటకలోని శాఖలు బెంగళూరులోని నాగరభావి, హులిమావులలో ఉన్నాయి. తెలంగాణలోని శాఖలు బాచుపల్లి, తాండూరులో ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని శాఖ ఆగ్రాలో ఉంది.

ఈ విస్తరణలో భాగంగా మెట్రో నగరాల్లో నాలుగు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మూడు, గ్రామీణ ప్రాంతంలో ఒక శాఖను ప్రారంభించారు. వివిధ భౌగోళిక ప్రాంతాల్లోని వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలన్న KVB లక్ష్యాన్ని ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో, బాచుపల్లి మరియు తాండూరులలో కొత్తగా ఏర్పాటు చేసిన శాఖలను స్థానిక ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. బాచుపల్లి శాఖను శ్రీ డి. దాయక రెడ్డి, దయాకర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్, 'ప్రగతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్', అలాగే డాక్టర్ రంజితా నాదెండ్ల (MBBS, ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ - NHS, UK), 'డాక్టర్ రంజితాస్ క్లినిక్', బాచుపల్లి కలిసి, సంప్రదాయబద్ధంగా గాయత్రీ దీపం వెలిగించి ప్రారంభించారు.

తాండూరు శాఖను కల్వ రాధాకృష్ణ, డైరెక్టర్, 'రాడికల్ బయో-ఆర్గానిక్స్ లిమిటెడ్' (తాండూరు) మరియు శ్రీమతి బిచాల బిచ్చల జ్యోతి కలిసి, గాయత్రీ దీపాన్ని వెలిగించి ప్రారంభించారు. అలాగే కట్కం కటకం వీరేందర్, 'గ్రెయిన్ అండ్ సీడ్స్ మెర్చంట్స్ అసోసియేషన్' అధ్యక్షుడు, తాండూరు, ఈ శాఖలోని 'సేఫ్ రూమ్'ను ప్రారంభించారు. రమేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, కరూర్ వైశ్య బ్యాంక్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కొత్త శాఖను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రధాన మార్కెట్లలో మా ఉనికిని మరింత బలోపేతం చేయడంతో పాటు, వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంలో ఎనిమిది కొత్త శాఖల ప్రారంభం మరో కీలక అడుగు. మెట్రో నగరాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రిటైల్, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ బ్యాంకింగ్ రంగాల్లో మాకు గణనీయమైన అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తలు