డల్కోఫ్లెక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా పంకజ్ త్రిపాఠి
ముంబై: మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi) నటించిన స్మార్ట్‌సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది.
ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది. మలబద్ధకం గురించి మరింత బహిరంగంగా మాట్లాడేలా ప్రోత్సహించడంతో పాటు, ఒక సరళమైన ప్రతిపాదనను ప్రజలకు చేరువ చేసేందుకు హాస్యం, అందరికీ సుపరిచితమైన కార్యాలయ నేపథ్యాన్ని ఉపయోగించింది. మలబద్ధకంతో పాటు దానికి సంబంధించిన మూడు సమస్యలైన కడుపు ఉబ్బరం, ముక్కోవడం, గట్టి మలం వంటి వాటికి ఒకే ఒక తెలివైన పరిష్కారం అనే సందేశాన్ని ఈ ప్రచారం హైలైట్ చేస్తుంది. ఈ ప్రచారంలో ప్రధాన ఆకర్షణ పంకజ్ త్రిపాఠి నటించిన కొత్త ప్రకటన చిత్రం. తనదైన ఆప్యాయతతో కూడిన నటన, సున్నితమైన హాస్యం ద్వారా త్రిపాఠి కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌ను పరిచయం చేస్తూ, బ్రాండ్ స్మార్ట్‌సొల్యూషన్ ప్రతిపాదనను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా అందించారు.
మలబద్ధకం ఉన్నవారికి ఒక్కోసారి ఒక్కో రకమైన ఇబ్బంది ఎదురవుతుంది. కడుపు ఉబ్బరం, మలవిసర్జన సమయంలో ముక్కోవడం, గట్టిగా ఉన్న మలం వంటి సమస్యల వల్ల సరైన ఉపశమనాన్ని పొందడం కష్టంగా అనిపించవచ్చు. డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌లోని రెండు రకాల శక్తివంతమైన పదార్థాలు ఈ సమస్యల నుంచి సమర్థవంతమైన ఉపశమనం అందించడంలో సహాయపడతాయి. ఈ ప్రచారం గురించి, శ్రీమతి నూపుర్ గుర్బక్సాని, బ్రాండ్ & ఇన్నోవేషన్ హెడ్, ఒపెల్లా (ఇండియా) మాట్లాడుతూ, “ప్రతిరోజూ 2.76 కోట్ల మంది భారతీయులు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు.
అయినప్పటికీ, వీరిలో మూడింట ఒక వంతు మంది ఈ సమస్యకు ఎప్పుడూ వైద్య సహాయం తీసుకోరు. దాదాపు సగం మంది పెద్దగా ప్రయోజనం లేని ఇంటి చిట్కాలపైనే ఆధారపడుతున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలు, ప్రకటనల్లో మలబద్ధకాన్ని హాస్యంగా చూపిస్తూ, ఈ సమస్యతో బాధపడేవారు ఎదుర్కొనే నిజమైన ఇబ్బందులను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఈ రంగంలో ప్రముఖ బ్రాండ్‌గా, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించడంతోనే మా బాధ్యత ముగియదని మేము భావిస్తున్నామన్నారు.