రామన్ ‘నోబెల్’ కిరణాలు!
ఏ శాస్త్రవేత్తయినా నోబెల్ పురస్కారం గెలిచినప్పుడు విశ్వవిజేతగా ఫీలవుతూ అంతులేని భావోద్వేగాల ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కానీ మన సీవీ రామన్(CV Raman) మాత్రం.. ‘నా దేశానికి జాతీయ జెండా లేదు’ అని బాధ పడుతూ తనలో నిగూఢమైన దేశభక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. 1930లో ఆసియా ఖండంలోనే ఫిజిక్స్ విభాగంలో తొలి నోబెల్ గెలిచిన రామన్ కేవలం 200 రూపాయల పరికరాల ప్రయోగంతో ‘శాస్త్రం యొక్క సారాంశం స్వతంత్ర ఆలోచనల్లో ఉంది పరికరాలలో కాదు’ అంటూ విశ్వ మేధావులనే ప్రభావితం చేశారు.
రామన్ 1888 నవంబర్ 7న ఉదయించి, 1970 నవంబర్ 21న భౌతి కంగా అస్తమించారు. చిన్నప్పటినుంచే భౌతిక శాస్త్రం, గణిత అభ్యస నంలో చురుకుగా ఉండే రామన్ తన తల్లి ప్రోత్సాహంతో భారతీయ సంస్కృతి, సంగీతం, శాస్త్రీయ సాహిత్యంపై కూడా ఆసక్తి కనబరిచి జాతీ యవాద భావనలతో ఎన్నో వ్యాసా లు రాశారు. ఉపన్యాసాలిచ్చారు. ప్రకృతిని ఆరాధించే రామన్.. వయోలిన్, వీణ, మృదంగం, తబలా వంటి సంగీత వాయిద్యాల ధ్వని శాస్త్రంపై కూడా పరిశోధనలు చేశారు.
1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను ప్రకటించారు. దాన్ని పురస్కరించుకొని మన దేశం 1987 నుంచి ప్రతీ యేడాది ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. ఆకాశం, సముద్ర పు నీరు ఎందుకు నీలంగా ఉన్నాయనే ప్రశ్నకు జవాబే అణువులకు సంబంధించిన అస్థితిస్థాపక కాంతి పరిక్షేపణ దృగ్విషయమే రామన్ ఎఫెక్ట్. దీన్ని ప్రకటించి దాదాపు శతాబ్దం కావస్తున్నప్పటికీ.. నేటి కృత్రిమ మేధలో కూడా రామన్ ఎఫెక్ట్ అనువర్తిత ఫలితాలు అద్భుతంగా ఉన్నా యంటే రామన్ మేధస్సు ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు.
అందుకే రామన్ ఈ దేశపు నిజమైన సంపద నిల్వ ఉంచిన బంగా రంలో లేదు. దేశ ప్రజల మేధోపరమైన, శారీరక శ్రమ సామర్ధ్యంలో ఉంటుందంటారు. విదేశీ శాస్త్రవేత్తల ఎగతాళి మాటలను అధిగమిస్తూ 1924లో రామన్ రాయల్ సొసైటీలో ఫెలోగా సభ్యత్వం పొందారు. తన సొంత ఆస్తులతో రామన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్మాణం లో కీలకంగా వ్యవహరిస్తూ, తన తుది శ్వాసవరకు మన దేశ శాస్త్ర, సాంకే తిక రంగ అభివృద్ధి కోసమే పరిశోధనల్లో జీవించారు. మన శాస్త్రవేత్తలు సత్యేంద్రనాథ్ బోస్, విక్రమ్ సారాభాయ్, హోమ్ జహంగీర్ బాబా, మేఘనాథ్ సాహా, కలాం వంటివారికి మార్గ నిర్దేశనంచేస్తూ స్ఫూర్తిగా నిలిచారు.
రామన్‌కు ఉన్న అచంచలమైన ఆత్మవిశ్వాసం, స్వదేశీ పరికరాలతోనే ప్రపంచ స్థాయి పరిశోధనలు చేయగల ఆయన పట్టుదల తమను ఎంతో ప్రభావితం చేసిందనీ వెర్నర్ హైసన్‌బర్గ్, పాల్ డిరాక్, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, జార్జ్ గామోవ్ వంటి ప్రపంచ శాస్త్రవేత్తలు రామన్ అస్తమ యాన్ని కీర్తించారు. నోబెల్ బహుమతితో పాటు1929లో నైట్‌హుడ్, 1954లో భారతరత్న, 1958లో లెనిన్ శాంతి బహుమతి వంటి ప్రఖ్యాత పురస్కారాలు రామన్‌ను వరించాయి.
‘ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాన్ని బోధనా పరమైన, పారిశ్రామిక, ప్రభుత్వ లేదా సైనిక ఒత్తిళ్లతో నడపలేమని‘ నేను బలంగా నమ్ముతాను అంటారు రామన్. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దార్శనిక మేధావి రామన్.. తర్వాత ఫిజిక్స్‌లో మళ్లీ మనం నోబెల్ గెలవలేదు. అభి వృద్ధి చెందిన దేశంగా మనం అగ్రరా జ్యాలతో పోటీ పడాలంటే రామన్ స్ఫూర్తితో నోబెల్ స్థా యిలో మన ప్రయాణం సాగా లి. యువతరం రామన్ ఎఫెక్ట్ కలల తీరంలో స్వేచ్ఛగా విహరిస్తూ అనంత విశ్వ రహస్యాల శోధనలో రామన్ నోబెల్ కిరణాలుగా ఉదయించాలి!
సెల్:
9394749536
ఫిజిక్స్ అరుణ్ కుమార్