ఆ మోదం దిశగా డీలి మిటే షన్!
రాజకీయాల్లో అవకాశాల(Opportunities in politics) కోసం మహిళలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఇన్నాళ్లకు తెరపడబోతున్నది. పలు రంగాల్లో మహిళలకు ౩౩ శాతం రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ ఇప్పటివరకు రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయనే విమర్శలు తెలిసినదే. తాజాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న మహిళా బిల్లుతో విమర్శలకు అడ్డుకట్ట పడబోతున్నది. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే మహిళల ఆశలు కూడా చిగురించబోతున్నాయి.
ఈ నెల ౩౦వ తేదీ నుంచి ప్రత్యేకంగా జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఆ కల సాకారం కాబోతున్నది. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతోపాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువగా ఉండడంతో మున్ముందు కాలంలో దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరగడం లాంఛనమే కానున్నది.
దేశంలో లోక్‌సభ, శాసనసభ ని యోజకవర్గాల పెంపు, పునర్వ్యవస్థీకరణతో పాటు చట్టసభల్లో మహిళ లకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన చారిత్రక బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈనెల 30న లోక్‌సభ ప్రత్యేక సమావేశాల్లో మ రోసారి ప్రవేశపెట్టబోతుంది. 2026 ఏప్రి ల్ 16న 131వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ డిలిమిటేషన్, మహిళా బిల్లు సభ ఆమోదం పొందలేదు. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల (352) సభ్యుల మద్దతును కూడగట్టలేకపోవడం తో అప్పట్లో బిల్లు సభ విశ్వాసం పొందలేకపోయింది.
ప్రస్తుతం ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడంతో పాటు రానున్న 25 సంవత్సరాల పాటు (2051 వరకు) నియోజకవ ర్గాల పెంపును స్తంభింపజేసే ప్రతిపాదన, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లును సభ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టబోతుంది. అప్పట్లో వీగి పోయిన డీలిమిటేషన్, మహిళా బిల్లు.. ఈ సారైనా సభ ఆమోదం పొందుతుందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతుంది. గత అనుభవాల దృష్ట్యా బిల్లు సభ ఆమోదం పొందటానికి అన్ని చర్యలు చేపట్టిన తరువాతనే కేంద్రం ముందడుగు వే స్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతం లో ఈ బిల్లుకు 298 మంది ఎంపీలు మద్దతిచ్చారు. కానీ, బిల్లు సభలో ఆమోదం పొందాలంటే 350 నుంచి 360 మంది సభ్యులు మద్దతు కూడగట్టాలి.
పశ్చిమబంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పాండిచ్చేరి రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత దేశంలో మారి న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా లోక్‌సభలో ఎన్డీఏ బలం 320గా ఉంది. డీలి మిటేషన్, మహిళా బిల్లు సభ ఆమోదం పొందాలంటే ఇంకా 30 నుంచి 40 మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్‌సభలో 22 మంది సభ్యులున్న డీఎంకే, నేష నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (పవార్) 8 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ నలుగురు సభ్యుల మద్దతు కీలకంగా మారింది. ఈ మూడు పార్టీలు అంగీకరించిన తర్వాతే బిల్లును సభలో ప్రవేశపెడుతున్నారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ మూడు పార్టీలు మద్దతు ఇస్తే సభలో బిల్లు ఆమో దం పొందటం లాంఛనమే.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తే జనాభా పెరుగుదలను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.131వ రాజ్యాంగ సవరణ బిల్లు సభ ఆమోదం పొందకుండా చూడటంలో కూడా డీఎంకే క్రియాశీలక పాత్ర పోషించింది. అయితే తమిళనాడులో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపాలైంది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి డీఎంకే తప్పుకుంది.
బిల్లుకు డీఎంకే మద్ద తు కూడగట్టడంలో ఎన్డీఏ సఫలీకృతమైనట్లుగానే కనపడుతుంది.డీఎంకే ప్రతిపాద నలను డీలిమిటేషన్, మహిళా బిల్లులో చేర్చడం వల్ల అనుకూలంగా ఓటు వేయటానికి ఆ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీ అయి న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక, ఐదవ అతి పెద్ద పార్టీ అయిన డీఎం కే తన వైఖరిని మార్చుకోవటంతో బిల్లు ఆమోదం పొందటానికి మార్గం సుగమం అవుతోంది. ఓటింగ్ రోజు మరికొందరు సభ్యులు, మరికొన్ని పార్టీలు సభకు దూ రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబ ట్టి బిల్లు ఆమోదం పొందటానికి అవసరమైన మెజార్టీకి మద్దతు కూడగడతామనే విశ్వాసాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యక్తం చేస్తున్నారు.
డిలిమిటేషన్, మహిళా బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే 30 సంవత్స రాలుగా చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్న మహిళల కల సాకారంకానుంది. మహిళల ప్రాతినిధ్యం 280 స్థానాలకు పెరగనుంది. లోక్‌సభ సీట్ల పెంపు వల్ల అదనంగా పెరిగిన 307 స్థా నాల నుంచి కొత్త నాయకత్వం లోక్‌సభలోకి అడుగుపెడుతుంది.లోక్‌సభ, శాసన సభల్లో పెరిగిన ప్రాతినిధ్యంతో అభివృద్ధి, సంక్షేమాల డెలివరీ మెకానిజం మెరుగుపడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమ వుతున్నాయి.
డీలిమిటేషన్ బిల్లు ఆమో దం పొందితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రా ల ప్రాతినిధ్యం 129 నుంచి 195 సీట్లకు, వాటా 23.76 శాతం నుంచి 23.87 శాతానికి స్వల్పంగా పెరుగుతుంది. కానీ, సం ఖ్యా బలం ప్రకారంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిథ్యం మరింత పెరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. 12 ఉత్తరాది రాష్ట్రాల సంఖ్యా బలం 243 నుంచి 368 స్థానాలకు పెరగనుంది. మొ త్తంగా డీలిమిటేషన్ ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ నాలు గో సారి కూడా అధికారంలోకి వచ్చేందుకు డీలిమిటేషన్, మహిళా బిల్లు ఆమో దానికి ఆసక్తి కనబరుస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే దేశ రాజకీయ చరిత్రలో మైలురాయిగా నిలిచి పోనుంది.
వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, సెల్ నం: 9885465877