55% జనాభా.. 0.04% వాటా?
టీ చిరంజీవులు :
భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం(Social, economic, and political justice) గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక సాధికా రత.. ఈ నాలుగు అంశాలను ప్రధానంగా పరిగణించాలి. వీటన్నింటికీ పునాది ప్రభుత్వ బడ్జెట్(Government Budget). ఎందుకంటే బడ్జెట్లో నిధులు కేటాయించ కుండా ఏ సామాజిక వర్గం సమ గ్రాభివృద్ధి సాధించలేదు. 2014లో కేం ద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం(BJP government), ఓబీసీలకు(OBC) పెద్దపీట వేస్తున్నామని, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని పదేపదే ప్రకటిస్తోంది.
అంతేకాకుండా, ఓబీసీ వర్గానికి చెందిన ప్రధాన మంత్రి(Prime Minister) నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోందని, బీసీలకు రాజకీయంగా, పరిపాల నాపరంగా తగిన గుర్తింపు కల్పిస్తున్నామని చెబుతోంది. మరి, వారి హయాంలో దేశ బడ్జెట్లో బీసీల జనాభాకు అనుగుణంగా ఆర్థిక వాటా దక్కిందా? ఒకసారి పరిశీలిద్దాం. బీసీల ఆర్థిక విధ్వంసం సంప్రదా య వృత్తుల విచ్ఛిన్నం నుంచి గిగ్ ఎకానమీ వరకు భారతదేశంలో బీసీలు మం డల్ కమిషన్ అంచనా ప్రకారం వారి జనా భా 52 శాతం. కానీ, నేడు 55 శానికి పేనే ఉంది. అంటే 145 కోట్ల జనాభాలో సుమారు 80 కోట్లు.

ఈ విస్తారమైన జనాభాలో గణనీయమైన సంఖ్యలో కుటుం బాలు పేదరికం, ఆర్థిక అస్థిరత, నిరుద్యోగం, ఉపాధి భద్రత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
బీసీలలో దాదాపు 60 శాతం మంది, అలాగే సంచార, అర్థ సంచార జాతులలో 90% మంది అత్యంత పేదరికంలో ఉన్నారనేది వాస్తవం. బీసీల ఆర్థిక వెనుకబాటుతనానికి చారిత్రక, సామాజిక కారణాలున్నా యి. కుల వ్యవస్థ అనేక తరాలుగా కొన్ని వర్గాలను నిర్దిష్ట వృత్తులకు పరిమితం చేసింది.
చేనేత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మత్స్యకార, గొర్రెల పెంపకం, క్షౌరవృత్తి, రజక, గౌడ తదితర వృత్తుల ద్వారా ఈ సమాజాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన సేవ చేశాయి.
కానీ పారిశ్రామికీక రణ, యాంత్రీకరణ, మార్కెట్ వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ కారణంగా ఈ సంప్రదా య వృత్తులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని వృత్తులు కనుమరుగ య్యాయి. తమ వృత్తులను ఆధునీకరించుకోవడానికి అవసరమైన పెట్టుబడి, సాంకే తిక పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు అనేక కుటుంబాలకు అందుబాటులో లేవు.
ఫలితంగా తరతరాలుగా వృత్తుని నమ్ముకొని జీవించిన కుటుంబాలు ఉపాధి కోల్పోయి అసంఘటిత రంగంలోకి వెళ్లాల్సి వచ్చింది. మరో వైపు ఆధునిక విద్యను అభ్యసించిన బీసీ యువతకు కూడా తగిన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. డిగ్రీలు, ఇంజినీ రింగ్, పీజీ చదివిన యువతలో కొందరు తమ అర్హతలకు తగిన ఉద్యో గాలు దొరక్క డెలివరీ సేవలు, రైడ్ షేరింగ్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ వంటి గిగ్ ఎకానమీ ఉద్యోగాలపై ఆధారపడుతున్నారు. స్థిరమైన వేత నం, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా అస్థిరమైన ఆదాయంతో జీవిస్తున్నారు.
ఆర్థిక ఒత్తిడి, అప్పులు, నిరుద్యోగం, ఉపా ధి అస్థిరత కారణంగా వివిధ సామాజిక వర్గాల్లో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. బీసీ వృత్తిదారులు, చిన్న వ్యాపా రులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని వ్యక్తిగత వైఫల్యంగా కాకుండా నిర్మాణాత్మక ఆర్థిక, సామాజిక సమస్యగా ప్రభు త్వాలు గుర్తించాలి. ఇలాం టి పరిస్థితుల్లో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలి. సంప్రదాయ వృ త్తుల ఆధునీకరణ, కొత్త పరిశ్రమల్లో ప్రవే శం, ఆధునిక నైపుణ్య శిక్షణ, స్టార్టప్‌లకు పెట్టుబడి, మార్కెటింగ్ సహాయం, ఉపాధి భద్రత వంటి అంశాలకు ప్రత్యేక ప్రణాళికలు అవసరం.
ప్రత్యేక బడ్జెట్ ఉపప్రణాళిక ఏదీ?
2014-15 మధ్య కేంద్ర బడ్జెట్ రూ.17. 95 లక్షల కోట్లు. 2026--27 నాటికి అది రూ.53.47 లక్షల కోట్లకు చేరింది. అంటే 12 ఏళ్లలో బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ కాలంలో ఎస్సీల కోసం షెడ్యూల్ కులాల అభివృద్ధి ప్రణాళిక, ఎస్టీల కోసం షెడ్యూల్ తెగ ల అభివృద్ధి ప్రణాళిక కింద అనేక మంత్రిత్వ శాఖల ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. ఆయా ప్రణాళికల కింద 2026-- 27లో ఎస్సీలకు సుమారు రూ.1.96 లక్షల కోట్లు, ఎస్టీలకు సుమారు రూ.1.39 లక్షల కోట్లు కేటాయించారు.
మరి దేశ జనాభాలో గణనీయమైన వాటా కలిగిన బీసీ లకు ఇదే తరహాలో ప్రత్యేకమైన సమగ్ర కేటాయింపులు/ఉప ప్రణాళిక ఎందుకు లేదు?, అన్ని మంత్రిత్వ శాఖల బడ్జెట్లో బీసీల అభివృద్ధికి కేటాయించే నిధులను ఏకీకృతం గా గుర్తించే వ్యవస్థ ఎందుకు లేదు. అంటే బీసీలు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరు లా?. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రణాళికలు అవసరమైనట్లే బీసీలకు కూడా ప్రత్యేక బడ్జెట్ ఎం దుకు ఉండకూడదు? ఎస్సీలు, ఎస్టీలు వేల సంవత్సరాలుగా సామాజిక వివక్షకు, అంటరానితనానికి, ఆర్థిక దోపిడీకి, విద్యా అవకాశాల నిరాకరణకు గురైన వర్గాలు.
వారి చారిత్రక అణ చివేతను గుర్తించి రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించింది. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు, రిజర్వేషన్లు, ప్రత్యేక బడ్జెట్ అభివృ ద్ధి ప్రణాళికలు అమలు చేయడం సముచితమైన చర్య. అయితే ఇదే సమయంలో బీసీలలోని అనేక కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను కూడా విస్మరించకూ డదు. బీసీలన్నీ ఆర్థికంగా అభివృద్ధి చెం దిన వర్గాలు కావు. బీసీల్లోనే అనేక కులా లు అత్యంత పేదరికంలో, నిరక్షరాస్యతలో, భూమిలేని స్థితిలో, ఉపాధి భద్రత లేకుం డా జీవిస్తున్నాయి.
కొన్ని సంప్రదాయ వృత్తి సమూ హాలు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో తమ జీవనాధారాలను కోల్పో యి తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో నిర్వహించిన సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ కులాల సర్వే (సీపెక్)లో కొన్ని సంచార, అర్థ సం చార కులాలు దళితులకంటే వెనుకబడినట్లు తేలింది. ఇక్కడ మనం ఒక విష యాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రణాళికలు ఉండటాన్ని బీసీలు గానీ, ఇతరులు గానీ వ్యతిరేకించడం లేదు.
వారి చారిత్రక అణచివేతకు తగిన పరిహారం, అభివృద్ధి అవకాశాలు కల్పించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత. అదే సమయంలో బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలకు కూడా వారి వాస్తవ సామాజిక, ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు ఏర్పాటు చేయాలని కోరడం కూడా అంతే సముచితం.
బీసీలకు బడ్జెట్లో కేటాయింపులు 0.04%మాత్రమే. కనీసం ఒక్క శాతానికి కూడా నోచుకోరా?. 2011 జనగణన ప్రకారం ఎస్సీ జనాభా 16.6 శాతం, ఎస్టీ జనాభా 8.6%. మండల్ కమిషన్ ప్రకారం ఓబీసీలు సుమారు 52%. 2026--27 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాలకు 38 వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా కేటాయింపులు రూ.1,96,400 కోట్లు, అలాగే ఎస్టీలకు కేటాయించింది రూ.1,39,190 కోట్లు. మరి బీసీలకు కేటాయింపులు ఎంత? 2026--27 కేంద్ర బడ్జె ట్లో ప్రధానమంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు పథకం వికసిత్ భారత్ (పీఎం యాసవి) పథకం కింద ఓబీసీ, ఈబీసీ, డినోటిఫైడ్ తెగలకు చెందిన వర్గాలకు కలిపి కేవలం రూ.2,320 కోట్లు మాత్రమే కేటాయించారు.
అంటే మొత్తం బడ్జెట్లో 0.04 శాతం. ఈ పథకంలో ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు, హాస్టళ్లు, ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం వంటి అం శాలున్నాయి. రూ.2,320 కోట్లు మొత్తం కూడా బీసీల అభివృద్ధి బడ్జెట్ కాదు. ఇం దులో ఆర్థికంగా వెనుకబడిన ఆధిపత్య కు లాల బడ్జెటూ ఉంది. అంతేకాకుండా ఇది కొన్ని విద్యా, సంక్షేమ పథకాల కేటాయింపు మాత్రమే.
ఈ అరకొర బడ్జెట్‌తో బీసీల అభివృద్ధి ఎలా సాధ్యమో ప్రభుత్వాలు ఆలోచించాలి. అన్ని మంత్రిత్వ శాఖల ద్వారా బీసీలకు కలిగే మొత్తం ఆర్థిక ప్రయోజనాలను కలిపి చూపించే సమగ్ర బీసీ బడ్జెట్ లేదు. ఇదే అసలు సమస్య. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు ఉన్నప్పుడు బీసీలకు కూడా అలాంటి ప్రణాళిక ఏర్పాటు చేయాలి కదా?.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
1. బీసీల వాస్తవ జనాభాను గుర్తించి జనాభా ప్రాతిపదికన ప్రత్యేక బడ్జెట్ ఎం దుకు కేటాయించడం లేదు?
2. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక లున్నప్పుడు బీసీలకు ప్రత్యేక ఉప ప్రణాళికలు ఎందుకు లేవు?
3. బీసీల్లో కడుపేద కుటుంబాల విద్యార్థులకు ఉన్నత, విదేశీ విద్య, పరిశోధనకు తగిన నిధులు ఎందుకు పెంచడం లేదు?
4. సంప్రదాయ కులవృత్తుల ఆధునీకరణకు ఆర్థిక ప్యాకేజీ ఎందుకు లేదు?
5.బీసీ యువతకు ఆధునిక నైపుణ్యాలు, స్టార్టప్ పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు తగిన సహాయం ఎందుకు అందించడం లేదు?
6.గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్య బీమా, కనీస ఆదాయ భద్రత కల్పించడానికి మరింత సమగ్ర విధానం ఎందుకు రూపొం దించడం లేదు?.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖతో పాటు బడ్జెట్ ఉపప్రణాళిక తక్షణ అవసరం. శాస్త్రీయ పద్ధతిలో 2027 సెన్సస్‌లో కులగణన జరగాలి.
కులగణన ఆధారంగా జనాభా వాటా ను నిర్ధారించి బడ్జెట్ కేటాయింపులు చేయాలి. ప్రతి మంత్రిత్వ శాఖలో బీసీలకు సంబంధించిన నిధు లను ప్రత్యేకంగా గుర్తించాలి. విద్య, ఉపాధి, పరిశ్రమలు, చేతివృత్తులు, ఆధునిక నైపుణ్యాలు, పారిశ్రామిక పెట్టుబడులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ప్రతి సంవత్సరం కేటాయింపులు, వాస్తవ వ్యయం, లబ్ధిదారుల వివరాలను పార్లమెంటుకు సమర్పించాలి.
’అన్ని పార్టీలు బీసీలను మోసం చేసినవే!, పాలకులకు బీసీల ఓట్లు కావాలి, వారికి నిధులు మాత్రం వద్దా?.. బడ్జెట్ లో తగు కేటాయింపులు లేకుండా బీసీలు ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతారో సమాధానం చెప్పాలి’. గతంలో కులగణన జరపకుండా, బీసీలను గుర్తించకుండా తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓబీసీలకు పెద్దపీట వేశామని బీజేపీ చెబుతు న్నా, పనితీరు ఆస్థాయిలో లేదు. కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనది. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఆర్థి క న్యాయం కూడా కావాలి.
దేశ సంపదలో, బడ్జెట్లో, విద్యా అవకాశాల్లో, పారి శ్రామిక అభివృద్ధిలో, ఆర్థిక వనరుల్లో జనాభా నిష్పత్తికి తగిన వాటా ఇవ్వాలి. సంప్రదాయ వృత్తుల నుంచి ఆధునిక ఆర్థిక వ్యవస్థలోకి బీసీలు గౌరవప్రదంగా ప్రవేశించడానికి ప్రభుత్వాలే ప్రత్యేక పెట్టుబడులు పెట్టాలి. బడ్జెట్లో న్యాయమైన వాటా లేకుండా ఆర్థిక సాధికారత సాధ్యం కాదు. ఆర్థికంగా లేకుండా రాజకీయలలో రాణించటం కష్ట మైన విషయం. అందుకే బీసీ లు బడ్జెట్ లో తమ జనాభా కు, పేదరికానికి తగిన వాటా సాధించే వరకు పోరాటం చేయాల్సిందే.
(కేంద్ర బడ్జెట్లో బీసీలకు
తీరని అన్యాయం)
(2014-15 నుంచి 2026-27 వరకు కేంద్ర బడ్జెట్లపై సామాజిక,
ఆర్థిక విశ్లేషణ)
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్