పల్లె వైద్యం ప్రశ్నార్థకం!

17-11-2026 | 05:05am

డాక్టర్ ఎస్.వీ.భూపాల్‌రెడ్డి ::

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అందుబాటులో ఉండే ప్రాథమిక వైద్యం(Primary medical care) ప్రశ్నా ర్థకంగా మారుతోంది. వైద్య సదుపాయాల కొరత ఉన్న పల్లెల్లో ప్రజలకు ప్రథమ చికిత్స(First Aid) అందిస్తూ అండగా నిలుస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలపై వైద్య ఆరోగ్యశాఖ(Health Department) అధికారుల తనిఖీలు, చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

నిబంధనల పేరుతో కొందరు గ్రామీణ వైద్యులను(Rural doctors) లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకోవడం సమంజసమే. అయితే అధికారుల చర్యలు అందరికీ ఒకే విధంగా వ ర్తించడం లేదని, వారి వ్యవహారశైలిపై వస్తున్న విమర్శలకు ఉన్నతాధికారులు స మాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.  

ప్రాథమిక వైద్యమే ఆధారం 

నగరాలు, పట్టణాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు, పెద్ద వైద్యశాలలు అందుబాటు లో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అనేక గ్రా మాల్లో అత్యవసర సమయంలో వెంటనే వైద్య సహాయం పొందడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. ముఖ్యంగా రాత్రివేళల్లో జ్వరం, దగ్గు, జలుబు చేసినా, ప్రమాదాలు జరిగినా స్థానికంగా అందుబాటులో ఉండే వైద్యసేవలపైనే ప్రజలు ఆధారపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీలు అందుబా టులో ఉండటం వెసులుబాటుగా మారిం ది. అయితే ప్రాథమిక చికిత్స అందించడం ఒకటైతే, అర్హత లేని వైద్య చికిత్సలు, అనుమతి లేని మందుల వినియోగం మరో అంశం. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను ఎవరూ సమర్థించలేరు. అదే సమయంలో నిబంధనల పరిధిలో పనిచేస్తున్న వారిని కూడా అనవసరంగా వేధిం చకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిబంధనలు కొందరికేనా?

వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల అమలులో పారదర్శకత, సమానత్వం ఉండా లని ప్రజలు కోరుతున్నారు. కొందరు అధికారులు తమ పరిధిలోని గ్రామీణ వైద్యు లపై కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే శాఖ లోని అధికారులపై గతంలో వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణ జరిగింది?, తీసుకున్న చర్యలు ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సొంత మెడికల్ షాపుల వ్యవహారంలో కొందరు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి.

వాటికి సంబంధించిన విచారణ వివరాలు, చర్యల స్థితిగ తులను సంబంధిత శాఖ వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు అదే స్థానాల్లో కొనసా గుతున్నారనే విమర్శలు నిజమైతే, వాటిపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో చిన్నపాటి వైద్య సేవలు అందించే వారిపైనే చర్యలు తీసుకుంటూ, అధికారులపై వచ్చిన ఆరోపణలను పట్టించుకో కపోతే ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం ఎలా నిలుస్తుంది?

పేదల జేబుకు భారం 

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ పెద్ద ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత ఉండదు. రోజువారీ కూలీ పను లు చేసుకునే కుటుంబాలకు చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రయాణ ఖర్చు లు, వైద్య పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులు భారంగా మారుతాయి. సమీపంలో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో లేకపో తే వారి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే ప్రజలకు అందు బాటులో ఉండే వైద్య సేవల పేరుతో అనర్హులు వైద్యులుగా వ్యవహరించడం కూడా ప్రమాదకరమే. అర్హతలు, అనుమతులు లేకుండా వైద్య చికిత్సలు అందించడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. అందుకే ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలి. ఎవరు ఏ సేవలు అందించవచ్చు? ఎలాంటి చికిత్సలు చేయకూడదు? ఎప్పుడు రోగులను అర్హత కలిగిన వైద్యుల వద్దకు పంపాలి? అనే అంశాలపై గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించాలి.

మార్గదర్శకాలతోనే భరోసా 

గ్రామీణ వైద్య సేవల వ్యవస్థను పూర్తిగా విస్మరించడం కానీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించడం కానీ సమంజసం కాదు. తప్పు చేసి న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో నిబంధనల పరిధిలో పనిచేసేవారికి సరైన మార్గదర్శకత్వం అందించాలి. ముందుగా అవగా హన కార్యక్రమాలు నిర్వహించి, అనుమతులు, అర్హతలు, వైద్య పరిమితులపై స్పష్టత ఇవ్వాలి. ఆర్‌ఎంపీ, పీఎంపీల పేరుతో ఎవరికైనా వైద్య వత్తిని నిర్వహించే హక్కు ఉందని చెప్పలేం. కానీ,గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరతను కూడా విస్మరించలేం. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం తోపాటు, అత్యవసర వైద్య సేవలను గ్రామస్థాయికి విస్తరించాల్సిన అవసరం ఉంది. 

జవాబుదారీతనం ఏదీ? 

గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోం ది?, ఆర్‌ఎంపీ, పీఎంపీలకు చట్టబద్ధమైన వైద్య పరిమితులపై శాఖ ఎప్పుడైనా సమగ్ర అవగాహన కల్పించిందా?, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటున్న ప్పుడు అందరికీ ఒకే విధమైన ప్రమాణాలు పాటిస్తున్నారా? ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

అలాడే అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణలు జరిగితే వాటి ఫలితాలను ప్రజలకు ఎందుకు వెల్లడించడం లేదు?, గ్రామీణ పేదలకు సమీపంలో అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? అనేది తేల్చాల్సిన ప్రశ్నలు. అంతేకాకుండా వైద్య ఆరో గ్యశాఖ ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ఆర్‌ఎంపీ, పీఎంపీలపై చర్యల కోణంలోనే చూడకుండా గ్రామీణ పేదల వైద్య అవసరాల కోణంలోనూ పరిశీలించాలి.

తప్పు చేసిన వారికి శిక్ష ఉండాలి.. అదే సమయంలో నిబంధనలు పాటించే వారికి రక్షణ ఉండాలి. ఆరోపణలు వచ్చిన అధికారులపైనా నిష్పక్షపాత విచారణ జర గాలి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చకుండా, అందుబాటులో ఉన్న ప్రాథమిక వైద్య సేవలు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడితే నష్టపోయేది సామాన్యులే. ప్రజల ప్రశ్న ఒక్కటే.. గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యం అం దించడమే లక్ష్యమా?, లేక అందుబాటులో ఉన్న ప్రాథమిక వైద్యసేవలు కూడా అందకుండా చేయడమా? ఈ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

 వ్యాసకర్త, సామాజికవేత్త

మరిన్ని వార్తలు