విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

21-11-2026 | 03:18pm

కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.20 లక్షలతో నిర్మించిన సెమినార్ హాల్ ప్రారంభం.

హనుమకొండ,(విజయక్రాంతి): విద్యార్థులు(Students) ఉన్నత లక్ష్యాలతో చదువుకుని సమాజానికి తిరిగి సేవ చేయాలనీ, విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ లోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సెమినార్ హాల్‌ ను శనివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సదుపాయాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Kakatiya Government Degree College) అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసి సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు.

కళాశాలలో అదనపు తరగతి గదులు, విద్యార్థినుల హాస్టల్ తదితర అవసరాలను గుర్తించి, వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడంతో పాటు కళాశాల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఎంపీ కడియం కావ్య  మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య ఎంత ఉందనే దానికంటే, కళాశాలలకు ఎంతమంది విద్యార్థులను రప్పించి నాణ్యమైన విద్య అందించగలుగుతున్నామనేదే ముఖ్యమన్నారు.

కళాశాల విద్యార్థులే కాకుండా, బయట ఉండి వివిధ కారణాలతో చదువుకునే యువత అవసరాలను కూడా గుర్తించాలని సూచించారు. విద్యార్థులందరినీ మన పిల్లలుగా భావించి వారి భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాకతీయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల అభివృద్ధి కోసం తాను పార్లమెంట్‌లో నిరంతరం ప్రస్తావిస్తున్నానని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి పీఎం ఉషా, రూసా వంటి పథకాల కింద మరిన్ని నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బి.చంద్రమౌళి, అధ్యాపకులు రజినిలత, వాసం శ్రీనివాస్, అరుణ, శ్యామ్, మాజీ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు