రేకుర్తి ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు
కొత్తపల్లి,(విజయక్రాంతి): రేకుర్తిలోని ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను స్థపతితో కలిసి 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి–కృష్ణ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన, ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, నిర్మాణ ప్రణాళికపై స్థపతితో చర్చించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మాజీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, సుధగోని నారాయణ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, గుర్రం రవీందర్ గౌడ్, బండారి తిరుపతి గౌడ్, నాయకులు రమేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.