హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపరాదు

20-11-2026 | 09:12pm

తాడ్వాయి,(విజయక్రాంతి): హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపరాదని ఎర్రపహాడ్ వైద్యాధికారి కాసిం(Errapahad Medical Officer Kasim) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Errapahad Primary Health Center)లో శుక్రవారం వైఆర్జి కేర్ లింక్ వర్కర్ స్కీం నిజామాబాద్(YRG Care Link Worker Scheme Nizamabad) ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త పరీక్షలు చేసుకోవడం అభినందనీయమని తెలిపారు.

వైఆర్జి కేర్ లింక్ వర్కర్స్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ సుధాకర్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఎన్ ఎ సి పి ప్రోగ్రాం ద్వారా గ్రామ పరిధిలో పూర్తిగా హెచ్ఐవి ని అరికట్టుటకు హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో లింక్ వర్కర్స్ స్కీం వారు చేస్తున్న సేవల గురించి వివరించారు.ఈ సందర్భంగా 73 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొంటికే మల్లవ్వబీరయ్య, ఉపసర్పంచ్ ఏనుగు ప్రభాకర్ రెడ్డి,ఆరోగ్య కార్యకర్తలు వజ్రం, రాజమణి,లింక్ వర్కర్లు హరిప్రియ,వరలక్ష్మి,ఆశా కార్యకర్తలు సంతోషి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు