పోలీసులకు ఆధునిక సాంకేతికతపై శిక్షణ
సీసీటీఎన్ఎస్ 2.0, నూతన చట్టాలపై అవగాహన
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ల టెక్ టీమ్ అధికారులు, సిబ్బందికి సీసీటీఎన్ఎస్ 2.0, కేసుల నమోదు, దర్యాప్తు, రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
మిషన్ వాత్సల్య, పోష్ చట్టం, పీఎం రాహత్, ఈ-డీఏఆర్ తదితర ఆన్‌లైన్ పోర్టళ్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ సంపత్, ఎస్‌ఐ లావణ్య, డీసీఆర్‌బీ, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.