26న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం

20-11-2026 | 09:35pm

చెన్నూరు ,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్(Chennur) లో  ఈ నెల 26న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం(Free Eye Medical Treatment Camp) నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్(Lions Club of Chennur) ప్రతినిధులు తెలిపారు.  శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను(Wall poster) శుక్రవారం అంగరాజ్‌పల్లి పీహెచ్‌సీ  డాక్టర్ కృష్ణ తేజ  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా   డాక్టర్ కృష్ణ తేజ మాట్లాడుతూ, స్థానిక సాయిరాం ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న శిబిరాన్ని ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.అవసరమైన వారికి ఉచిత కంటి వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ ప్రెసిడెంట్ లయన్ నిమ్మల సాగర్ , జోన్ చైర్ పర్సన్ లయన్ జాడి తిరుపతి, లయన్ జక్కుల సత్యనారాయణ, లయన్ పిప్పిరెడ్డి దీక్షిత్, లయన్ ఎన్నం సతీష్, మానుమండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు