ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన ఏఎస్ఐలు

20-11-2026 | 09:40pm

వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్(Warangal City Police Commissionerate) పరిధిలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పలువురు ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన అధికారులు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన వారిలో టి.కమల, ఎం.రాజేందర్, ఏ.సగాయమ్మ, వై.కాసులు, కె.పద్మ, ఎన్.లక్ష్మి, కె.సంతోష, సి. హెచ్.పద్మ ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ నూతనంగా పదోన్నతి పొందిన ఎస్‌ఐలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

మరిన్ని వార్తలు