నాచగిరి ప్రదక్షిణలో మారుమోగిన ‘నమో నారసింహ’ నామస్మరణ

15-09-2026 | 10:03pm

గజ్వేల్: శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Yogananda Laxmi Narasimha Swamy) జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలో మంగళవారం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఈవో బి. రంగాచారి ఆధ్వర్యంలో అర్చకుల మంత్రోచ్ఛరణలు, భక్తుల ‘నమో నారసింహ’ నామస్మరణల మధ్య ప్రదక్షిణ సాగింది. కార్యక్రమంలో మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ పల్లెర్ల రవీందర్, మాజీ ధర్మకర్తలు గాలి కిష్టయ్య, కర్రె పద్మా వెంకటేష్, కొత్తపల్లి శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు