వినాయక మండపాల్లో గంగుల పూజలు

15-09-2026 | 10:20pm

కరీంనగర్‌ సిటీ,(విజయక్రాంతి): వినాయక చవితి(Vinayaka Chavithi) పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌(MLA Gangula Kamalakar) నగరంలోని వివిధ వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశ్‌గంజ్‌లోని వరసిద్ధి వినాయక ఆలయం(Varasiddhi Vinayaka Temple)లో స్వామివారికి పూజలు చేసి, అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేయగా, కమిటీ నిర్వాహకులు ఆయనను సత్కరించారు.

అనంతరం రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణనాథుడికి పూజలు చేశారు. కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌(BRS) జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసి లక్ష్మణరావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, మల్లికార్జున రాజేందర్‌, గడ్డి ప్రదీప్‌,  మాజీ కార్పొరేటర్  సోహాన్ సింగ్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ, వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్,వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ బాద్యులు...పంపాటి హనుమండ్లు, పంపాటి శ్రీను, రాచర్ల రమేష్, పలువురు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు