శాస్త్రీయ విజ్ఞానంతోనే సమాజాభివృద్ధి

21-11-2026 | 04:25pm

చెకుముకి జిల్లా కోఆర్డినేటర్ తులసి ఆగమయ్య

ధర్మపురి,(విజయక్రాంతి): శాస్త్రీయ విజ్ఞానంతోనే విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథం పెంపొందుతుందని చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జిల్లా కోఆర్డినేటర్ తులసి ఆగమయ్య అన్నారు. శనివారం వెల్గటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.అనంతరం జరిగిన సమావేశంలో తులసి ఆగమయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ద్వారా సమాజంలో మార్పు వస్తుందని, తద్వారా దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత కారణంగా సమాజంలో వెనుకబాటుతనం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వెల్గటూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సైన్స్ టాలెంట్ టెస్టులతో విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందుతుందని, ఆ పోటీ తత్వం విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, నాగయ్య, రాంప్రసాద్, గంగరాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు