దేవాలయాల అభివృద్ధికి కృషి
21-11-2026 | 04:31pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాథోడ్ సుదర్శన్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట దేవస్థానాన్ని సందర్శించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో మాట్లాడారు. దేవరకోట ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న పల్లకి సేవ సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆలయంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో భూమయ్య ధర్మకర్తలు ఉన్నారు.