బీజేపీలో చేరిన నవాబుపేట సర్పంచ్, వార్డు సభ్యులు
ఎంపీ రఘునందన్‌రావు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న ప్రజాప్రతిని దులు
హత్నూర: సంగారెడ్డి జిల్లా(Sangareddy district) హత్నూర మండలం నవాబుపేట గ్రామ సర్పంచ్ ఎరుకలి బుచ్చయ్య(Nawabupeta Sarpanch Buchaiah)తో పాటు పలువురు వార్డు సభ్యులు బీజేపీలో చేరారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సమక్షంలో హత్నూర మండల బీజేపీ(BJP) అధ్యక్షుడు నాగప్రభుగౌడ్ ఆధ్వర్యంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందిన బుచ్చయ్య తాజాగా బీజేపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా సర్పంచ్ బుచ్చయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంతోపాటు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఎంపీ రఘునందన్‌రావు, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వల్దాస్ మల్లేశ్‌గౌడ్ ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ అధ్యక్షులు మల్లేష్ మండల బిజెపి ఉపాధ్యక్షుడు పాండు, వార్డు సభ్యులు మల్లేశం, శైలజ, ఆంజనేయులు, శివశంకర్, ఆంజనేయులు, నరేందర్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.