గిరిజన మిని గురుకులాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

07-10-2026 | 04:54pm

మల్లాపూర్, అక్టోబర్ 07 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన మినీ గురుకులం, టీజీ మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satyaprasad) బుధవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు.

విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా పరిస్థితులు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పళ్లికొండ నరేష్, జిల్లా విద్యాధికారి కె. రాము, తహసీల్దార్, ఎంపీడీవో, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు