క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

07-10-2026 | 05:31pm

గుండాల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఇల్లందు టీబి యూనిట్ గుండాల పీహెచ్సీ పరిధిలో వెన్నెలబైలు నందు టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం సర్పంచ్ ఈసం సుమలత(Eesam Sumalatha) అధ్యక్షతన నిర్వహించారు. వారు క్షయ వ్యాధి నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

క్షయ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, చికిత్స విధానం గురించి తెలియజేశారు. టీబీ వచ్చాక మందులు వాడే విధానం, వారికీ వచ్చే నిక్షయ్ పోషణ యోజన కింద ప్రతి నెల రూ. 1000 ఇవ్వడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలోవార్డ్ మెంబెర్స్, ఎంఎల్హెచ్పీ ప్రియాంక, హెచ్ఎస్ రాజు, పీహెచ్సీ సిబ్బంది, టీబీ సూపెర్వైజర్ అలెర్ట్ ఇండియా ఎన్జీఓ స్టాఫ్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు