పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన డిప్యూటీ సీఈవో సురేందర్
07-10-2026 | 05:20pm
నాగిరెడ్డిపేట, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మండలంలోని గోలి లింగాల, చినూర్ గ్రామాలలో బుధవారం జిల్లా డిప్యూటీ సీఈవో సురేందర్(Deputy CEO Surender) పెన్షన్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగుల సదరం సర్టిఫికెట్లను పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల అందరి దరఖాస్తులను పరిశీలించి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు సంతోష్ కుమార్, అనిత, ఫీల్డ్ అసిస్టెంట్లు లింగా గౌడు, అంజయ్య ఉన్నారు.