ప్రత్యేక ఓటర్ జాబితా పారదర్శకంగా నిర్వహించండి
బోథ్ అక్టోబర్ 7 (విజయ క్రాంతి): ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని బోత్ ఎన్నికల అధికారి ఐటీడీఏ పీవో మంద మకరందకు(ITDA PO Manda Makaranda) స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు. బుధవారం బోత్ కు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మెరుగు భోజన్న తోపాటు ఎస్ ఐ ఆర్ సమన్వయకర్త పసుల చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఎస్ఐఆర్ సమన్వయకర్త మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నోటీసులను తక్షణమే అందించాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడికి నూతన ఓటు హక్కు కల్పించాలని కోరారు.
అంతేగాక ఫోన్ నెంబర్ సెవెన్ ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని కోరారు. మ్యాపింగ్ కానటువంటి అందుబాటులో లేని ఓటర్లకు అన్ని రాజకీయ పార్టీల సహాయంతో గడపగడపకు తిరిగి నోటీసులు అందించాలని కోరారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తలమడుగు మండల అధ్యక్షులు కష్టాల ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు.