ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నిరసన
- - ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
- - డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన
- - కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
నారాయణఖేడ్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు.
అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి అన్యాయంగా తొలగిపోకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కని, ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో విఠల్‌రావు పాటిల్, సర్దార్ నాయక్, జ్ఞానేశ్వర్‌రెడ్డి, పండరిరెడ్డి, షారూఖ్‌ఖాన్, గోపాల్‌రెడ్డి, సుబూర్, మైతాబ్, ముంతాజ్ సేఠ్, శెట్టి శంకర్, మొహీద్, నగేష్ కురుమ, నారాయణ జాదవ్, వినోద్ నాయక్, వినయ్, ప్రతాప్‌రెడ్డి, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.