మండల గిరిజన సర్పంచుల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
తరిగొప్పుల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సర్పంచుల ఫోరం(Telangana Tribal Sarpanches Forum) జనగామ జిల్లా అధ్యక్షులు కొర్ర స్వరూప రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో తరిగొప్పుల మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులు భూక్య ధనుష్ నాయక్, కొత్త తండా సర్పంచ్ వర్కింగ్ అధ్యక్షులు భూక్య రవి నాయక్,
ఉపాధ్యక్షులు గుగులోత్ లలిత రాజు నాయక్,ప్రధాన కార్యదర్శి లావుడియా సుగుణ భీమా నాయక్ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. గిరిజన సర్పంచుల ఐక్యతతో తండాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అల్పతి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రాజమణి రాజు నాయక్ పాల్గొన్నారు.