బతుకమ్మ వేడుకలు
07-10-2026 | 05:36pm
మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ పత్తి సునీత ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని విద్యార్థినులు, అధ్యాపకుల సహాయంతో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంప్రదాయ పద్ధతిలో ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ వహీదా, కల్చరల్ కోఆర్డినేటర్ ఎం జ్యోతి, ఎన్ఎస్ఎస్ యూనిట్ -1, యూనిట్ -2 ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎండి. రిజ్వాన, ఎస్. సత్యరాణి, అధ్యాపకులు, విద్యార్థినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.