విద్యుత్ షాక్‌తో 10 నెలల చిన్నారి మృతి

06-11-2026 | 03:11pm

కొడిమ్యాల, నవంబర్ 6 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఆడుకుంటున్న 10 నెలల చిన్నారి విభూది ఆద్య చార్జింగ్‌లో ఉన్న విద్యుత్ కాంటాను తాకడంతో షాక్‌కు గురై మృతి చెందినట్లు సమాచారం. పసిపాప మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు