జనసురక్ష కార్యక్రమం విజయవంతం

18-11-2026 | 04:50pm

బెజ్జూర్, నవంబర్ 18 (విజయక్రాంతి) : దహెగాం సి ఎఫ్ ఎల్ టీమ్ సభ్యులు(Dahegaon CFL team members) రాజబాబు, శేఖర్, మల్లేష్ ఆధ్వర్యంలో బెజ్జూర్ మండలంలోని పాపన్‌పేట్ గ్రామంలో(Papanpet Village) జనసురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయికుమార్(Telangana Grameena Bank Manager Sai Kumar) తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్బిఐ ఏజీఎం పిజియన్ చేతన్, ఎల్ డి ఎం జనార్ధన్ రెడ్డి, వీఐడీఎస్ సంస్థ సీసీ రాజశేఖర్ ,ఐ ఆర్ ఐ ఎక్స్ ఛానల్ మేనేజర్  శివ, ఏపీఎం పాల్గొన్నారు.

అలాగే గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో  సి ఎఫ్ ఎల్ టీమ్ ద్వారా గ్రామ ప్రజలకు పలు ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించారు.  ప్రభుత్వ పథకాలు,బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ బ్యాంకింగ్, బీమా పథకాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు.

మరిన్ని వార్తలు