మహిళలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

18-11-2026 | 04:54pm

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

జుక్కల్, నవంబరు 18 (విజయ క్రాంతి): మహిళలు, రైతులు(Farmers), పేద ప్రజలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) సంక్షేమ పథకాలను(welfare schemes) అమలు చేస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా మండలంలోని 713 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలు తదితర వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించడంతో పాటు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు